Suriya 42 : సూర్య 42వ మూవీ టైటిల్ వచ్చేసింది..ఇక ఫ్యాన్స్ కు పండగే

-

టాలీవుడ్​లో బలమైన మార్కెట్‌ను సొంతం చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుల్లో ఒకరిగా.. బలమైన అభిమాన గణమున్న హీరోల్లో ఒకరిగా సూర్య గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా, నిర్మాతగా, టెలివిజన్‌ వ్యాఖ్యాతగా కూడా ఆయనకు మంచి పేరు ఉంది. హీరోగా ఇప్పుడు తన కెరీర్ లో సాలిడ్ లైనప్ ని సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

అలాగే తన కెరీర్ లో 42వ సినిమాని దర్శకుడు శివతో అనౌన్స్ చేయగా దీనిపై భారీ అంచనాలు నెలకొనగా మొన్ననే ఈ సినిమా నుంచి ఓ క్రేజీ మోషన్ పోస్టర్ వస్తుంది అని కూడా సాలిడ్ అప్డేట్ ఇవ్వగా పోస్టర్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, మేకర్ ఈ పోస్టర్ ని అనుకున్న టైముకే రిలీజ్ చేసేసారు. అయితే… తాజాగా ఈ సినిమా టైటిల్‌ కూడా అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకు కంగువా..Kanguva అనే టైటిల్‌ ను ఫైనల్‌ చేసింది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news