కరోనా కొత్త వేరియంట్ల కలకలం రేపుతోంది. భారత దేశంలో NB.1.8.1, LF.7 విస్తరిస్తున్నాయి. ఏపీ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు అయ్యాయి. సింగపూర్ లో ఎక్కువగా కొత్త వేరియంట్ల వ్యాప్తి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

కరోనా..మళ్లీ విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యారు. ఏపీలోని విశాఖలో తొలి కరోనా కేసు నమోదు నమోదు అయ్యింది. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్‌లో సైతం కరోనా కేసు నమోదు అయింది. భారత్‌లోని పలు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి కరోనా కేసులు. సింగపూర్, థాయ్‌లాండ్, హాంకాంగ్‌లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.