కాపు సోదరుల ప్రశ్నలు… పవన్ ను రౌండేసేస్తున్నారు!!

-

కాపులకు బాబు హయాంలో పరిపూర్ణమైన అన్యాయం జరిగినప్పుడు, కాపులను తీవ్రంగా అణగదొక్కినప్పుడు.. మౌనంగా, ఏమీ తెలియనట్లుగా ఉంటూ నిజజీవితంలో కూడా నటించిన పవన్.. కాపులకు న్యాయం చేస్తున్న వైఎస్ జగన్ ను విమర్శ్తిస్తున్నారంటూ వైకాపా నేతలు పవన్ పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో గతంలో బాబు పరిపాలనలో కాపులు పడిన ఇబ్బందులను, చూసిన నరకాన్ని ప్రత్యక్షంగా చూసిన కొందరు కాపు సామాజికవర్గానికి చెందిన వైకాపా మంత్రులు, నేతలు, కాపు సోదరులు పవన్ ను రౌండేసేస్తున్నారు!

పవన్ పై ఎవరు మాట్లాడినా, ఏమని ప్రశ్నించినా.. అవి పవన్ సమాధానం చెప్పలేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి అనడంలొ సందేహం లేదనేది పలువురి అభిప్రాయం. కాపులపై చంద్రబాబు ఉక్కుపాదం మోపినప్పుడు, కాపు రిజర్వేషన్ కోసం ముద్రగడ పోరాడినప్పుడు, కాపు కార్పొరేషన్ లో సరైన నిధులు కేటాయించబడనప్పుడు, కాపులకు – బీసీలకు మధ్య తాంబూలాలిచ్చి తన్నుకుచావమనేలా బాబు రాజకీయం చేసినప్పుడు.. పవన్ చూడలేదా.. కానరాలేదా? నాడున్న బాబు మైకంలో కాపులు గుర్తుకు రాలేదా? నేడు బీజేపీ సరసన చేరిన తరుణంలో.. రాజకీయంగా ఒక బలమైన సామాజికవర్గం తోడు తనకుందనే విషయాన్ని కమలం పెద్దల దగ్గర నిరూపించుకునే క్రమంలో.. కొత్తగా కాపులపై ప్రేమ పుట్టుకొచ్చిందా? అని పలువురు కాపు నాయకులు, కాపు సోదరులు ప్రశ్నిస్తున్నారు!

అనంతరం మైకుల ముందుకు వైకాపా మంత్రులు, నేతలు… ఈ విషయంలో ముందుగా మైకందుకున్నారు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు! కాపులపై చంద్రబాబు ఉక్కుపాదాన్ని మోపినప్పుడు, కాపు రిజర్వేషన్‌ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని లాఠీలతో కుళ్లబొడిచి ఆయన భార్యను, కుమారుడిని బండ బూతులు తిడుతూ నిర్బంధించినప్పుడు నోరు విప్పని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌..నాడెక్కడున్నారని, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు కన్నబాబు! వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కాపులకు మేలు చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారా? పాత మిత్రుడు చంద్రబాబుతో చెలిమిని పోగొట్టుకోలేక పవన్‌ మాట్లాడుతున్నారా? అంటూ తనదైన శైలిలో ప్రశ్నల వర్షాలు కురిపించారు.

అనంతరం మైకందుకున్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు! టీడీపీ మత్తులో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కాపుల గురించి మాట్లాడే నైతిక అర్హతను కోల్పోయారని మొదలుపెట్టిన రాంబాబు… చంద్రబాబు తన పాలనలో కాపుల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తే పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ముద్రగడను అరెస్ట్‌ చేయించి, వారి కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టినప్పుడు తనతో కలిపి కాపు పెద్దలందరూ మీడియా ముందుకు వచ్చినప్పుడు.. ఈ పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు.

ఇదే క్రమంలో మైకందుకున్నారు మంత్రి అవంతి శ్రీనివాస్! చంద్రబాబు ట్రాప్‌లో పడి పవన్ కల్యాణ్ అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని.. గతంలో కాపు సోదరుల్ని చంద్రబాబు నిలువునా ముంచినప్పుడు పవన్ ఎక్కడ ఉన్నారని.. కాపు ఉద్యమ నేత ముద్రగడతో పాటు ఆయన కుటుంబాన్ని చంద్రబాబు చిత్రహింసలకు గురిచేసినప్పుడు పవన్ మాట్లాడారా అని.. వంగవీటి రంగాని హత్య చేయించిన పార్టీతో చేతులు కలిపడం కరెక్టా అని.. టీడీపీ హయాంలో కాపు సోదరులు, యువకులపై అక్రమ కేసులు పెడితే ఆ కేసుల్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి కొట్టేయించిన సంగతి తెలియదా అని అవంతి.. పవన్ ను ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version