బహిరంగంగా రెచ్చిపోయిన కరణ్ కుంద్రా-తేజస్వీ..ఈ లవ్ బర్డ్స్‌పై నెటిజన్లు ఫైర్

-

బాలీవుడ్ సెలబ్రిటీలు కరణ్ కుంద్రా- తేజస్వీ ప్రకాశ్ లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ లవ్ బర్డ్స్ ఇప్పటికే చాలా సార్లు మీడియాకు చిక్కారు. తాజాగా తేజస్వి బర్తడే సందర్భంగా వీరిరువురు గోవాలో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, ఈ సెలబ్రేషన్స్ హద్దులు దాటాయనే కామెంట్స్ వినబడుతున్నాయి.

అందరూ చూస్తుండగానే బహిరంగంగా..వీరిరువురు చాలా క్లోజ్ గా మూవ్ అవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. అన్ని కెమెరాలు ఆన్ అయి ఉన్నప్పటికీ కరణ్ కుంద్రా- తేజస్వీ ప్రకాశ్ వాటిని పట్టించుకోకుండా మూవ్ అయ్యారు. అలా తేజస్వి..కరణ్ చాల క్లోజ్ గా ఉన్నారు.

ఈ వీడియోలు చూసి నెటిజన్లు వీరిని ట్రోల్ చేస్తున్నారు. వీరికి అసలు సంస్కారం లేదని అంటున్నారు. క్యూట్ నెస్ హద్దులు దాటిందని, ఇంతలా బరి తెగించారని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే అసహ్యంగా ఉందని, వీళ్లకు అసలు సిగ్గుందా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సెలబ్రిటీలు అయి ఉండి ఇలా చేయొచ్చా? అని అడుగుతున్నారు. ఆదర్శంగా లేకపోయినా పర్వాలేదు. కానీ, ఇలా అసహ్యం అనిపించే పనులు చేయొద్దని మరి కొందరు నెటిజన్లు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version