రిపోర్టర్‌ అంటూ మహిళను బెదిరించి రేప్‌.. ఆపై

-

తమ కామ వాంఛ తీర్చుకోవడానికి మృగాళ్లు అడ్డుఅదుపు లేకుండా అడ్డదారులు తొక్కుతూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మోసం చేయడానికి ఓ దుర్మార్గుడు జర్నలిస్టు పదవిని అడ్డుపెట్టుకున్నారు. తాను ఓ ఎలక్ట్రానిక్‌ మీడియా రిపోర్టర్‌నని, వ్యభిచారం చేస్తున్నావని ఛానల్‌లో ప్రసారం చేస్తానని బెదిరించి ఒంటరి మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె నుంచి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. దీంతో బాధితురాలు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల మేరకు..సుజాత నగర్‌కు చెందిన వివాహిత (33) తన భర్తతో విడిపోయి ఒంటరిగా నివశిస్తోంది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి దౌర్జన్యంగా ఆమె ఇంటిలోకి ప్రవేశించాడు. తాను ఓ ఎలక్ట్రానిక్‌ మీడియా రిపోర్టర్‌నని చెప్పి ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను నగంగా వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తానని బెదిరించి బంగారు చెవిదుద్దులు, ఉంగరం, రూ.ఐదు వేలు నగదు తీసుకుని పరారయ్యాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version