కరీంనగర్, వరంగల్ తిరుపతి టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే..!

-

ఈ వేసవి కి తిరుపతి వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఇది గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం ఓ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీ తో ఎంచక్కా తిరుమల వెళ్లి వచ్చేయచ్చు. కరీంనగర్, వరంగల్ నుండి తిరుపతికి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. ‘సప్తగిరి’ పేరు తో ఈ టూర్ ప్యాకేజీ ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. తిరుమలలోశ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాలు కూడా చూడచ్చు. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ గురువారం ఈ టూర్ ప్యాకేజీ కరీంనగర్, వరంగల్ నుంచి ఉంటుంది.

ఐఆర్‌సీటీసీ సప్తగిరి టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే.. గురువారం 12762 నెంబర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణం మొదలు అవుతుంది. రైలు రాత్రి 7.15 గంటలకు కరీంనగర్‌లో మొదలు అవుతుంది. రాత్రి 8.05 గంటలకు పెద్దపల్లిలో రాత్రి 9.15 గంటలకు వరంగల్‌లో ఎక్కచ్చు. రాత్రి 11 గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. మొదటి రోజు రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటారు.

హోటల్‌లో ప్రెషప్ అయిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ చూడచ్చు. మూడో రోజు ఉదయం 9 గంటలకు తిరుమలలో దర్శనం. రాత్రి 8.15 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో 12761 నెంబర్ గల ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కాలి. తెల్లవారుజామున 03:26 ఖమ్మంలో, 04:41 గంటలకు వరంగల్‌లో, 05:55 గంటలకు పెద్దపల్లిలో, ఉదయం 08:40 గంటలకు కరీంనగర్‌ చేరుకోవచ్చు. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.5660, ట్విన్ షేరింగ్‌కు రూ.5740, సింగిల్ షేరింగ్‌కు రూ.7120 చెల్లించాలి. అదే కంఫర్ట్ ప్యాకేజీలో అయితే ట్రిపుల్ షేరింగ్‌కు రూ.7560, ట్విన్ షేరింగ్‌కు రూ.7640, సింగిల్ షేరింగ్‌కు రూ.9010 చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version