“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !

-

గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు తమిళనాడు కు వదలం అని కన్నడ ప్రజలు చేస్తున్న పోరాటం రోజు రోజుకు ఉధృతం అవుతోంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కన్నడ సంఘాలు అనీ రేపు కర్నటకలో బంద్ కు పిలుపును ఇచ్చాయి. రేపు బంద్ కారణంగా రాష్ట్రంలోని బెంగుళూరు లోని స్కూళ్ళు, కాలేజీలు పూర్తిగా మూసివేయాలని సూచించారు. ఇంకా ఈ బంద్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండాలని బెంగుళూరు నగరంలో పోలీసులు 144 సెక్షన్ ను విధించడం జరిగింది.

ఈ బంద్ కు ఆటో రిక్షాలు, ప్రయివేట్ ట్రాన్స్పోర్ట్ మరియు హోటల్స్ సపోర్ట్ ఇవ్వగా… BMTC మాత్రం రేపు సర్వీస్ నడుపుతారని సమాచారం. మరి ఈ కావేరి జలాల కోసం రెండు రాష్ట్రాల మధ్యన వివాదం ఎప్పుడు తీరుస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news