అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !

-

సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ వోల్వట్ ఫీల్డింగ్ తీసుకుంది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ మహిళలు నిర్ణీత ఓవర్ లలో కేవలం 253 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. జట్టు ఇంత స్కోర్ చేయడానికి ప్రధాన కారణంగా ఓపెనర్ అమేలియా కర్… ఈమె 144 బంతుల్లో 14 ఫోర్ల సహాయంతో 88 పరుగులు చేసింది. ఇంకా గ్రీన్ (43) మరియు హన్నా రో (40) లు కూడా జట్టు స్కోర్ లో తమ వంతు సాయం చేశారు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మలబ మరియు డిక్లర్క్ లు మూడు వికెట్లు దక్కించుకోగా, క్లాస్ మాత్రం రెండు వికెట్లు తీసుకుంది. అనంతరం 254 పరుగులు లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన మరో 28 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్ ను మరియు సిరీస్ ను కైవసం చేసుకున్నారు సఫారీలు.

ఓపెనర్ గా వచ్చిన చివరి వరకు నిలబడి కెప్టెన్ ఇన్నింగ్స్ తో వోల్వట్ జట్టును గెలిపించుకుంది.. ఈ దశలో వోల్వట్ 141 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 124 పరుగులు చేసి అజేయ సెంచరీ ని చేసింది. ఈమెకు లస్ (53) మరియు కప్ (45) లు చక్కగా సహకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news