WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !

-

రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ కానుంది. మెయిన్ మ్యాచ్ లు మొదలయ్యే ముందు ప్రాక్టీస్ కోసం కొన్ని జట్లకు మాత్రమే దొరికిన సువర్ణావకాశం ఈ వార్మ్ అప్ మ్యాచ్ లు అని చెప్పాలి. అందులో భాగంగా మొదటి మ్యాచ్ లో ఈ రెండు జట్లు పోటీ పడుతున్నాయి. పాకిస్తాన్ ను బాబర్ అజాం లీడ్ చేస్తుండగా, న్యూజిలాండ్ కు కెప్టెన్ గా కేన్ విలియమ్సన్ వ్యవహరిస్తున్నారు, కాగా ఇటీవల ఆసియా కప్ లో నిరాశతో కూడిన ప్రదర్శన చేసిన పాకిస్తాన్ కు ఈ మ్యాచ్ పుంజుకోవడానికి మంచి అవకాశం..

అదే విధంగా కేన్ విలియమ్సన్ మరియు న్యూ జీలాండ్ టీం లో ఫామ్ లో లేని కొంతమందికి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. మరి ఇరు జట్లలోని ఆటగాళ్లకు రేపు జరగనున్న వార్మ్ అప్ మ్యాచ్ ఉపయోగపడుతుందని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news