దళిత ఉపాధ్యాయురాలిపై కుల వివక్ష.. చివరకు ఆమె ఏం చేసిందంటే..

-

లక్ష్మీ అనే దళిత మహిళ హలెచిక్కనహల్లి గ్రామంలో అంగన్​వాడీ టీచర్​గా పనిచేసేవారు. ఆమె దళిత వర్గానికి చెందిన మహిళ కావడంతో తమ పిల్లలను పాఠశాలకు పంపేవారు కాదు కొందరు తల్లిదండ్రులు. పిల్లలను తాకకుండా ఉండాలని సమీపంలోకి కూడా రానిచ్చేవారు కాదు. దళిత మహిళ అనే కారణంతో పాఠశాల ప్రాంగణంలోకి కూడా రావొద్దంటూ ఆమెను వేధించారు.  శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించిన లక్ష్మీ.. సమీపంలోని గోశాలే అంగన్​వాడీ కేంద్రానికి బదిలీ చేయించుకున్నారు.

తనను అవమానించిన వారికి తగిన బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కొత్త బోధనా విధానాన్ని ప్రవేశపెట్టారు. కాన్వెంట్లకు దీటుగా అంగన్​వాడీని తయారుచేయాలని అనుకున్నారు. అందుకోసం అంగన్​వాడీలో చేరిన 30 మంది విద్యార్థులకు కన్నడతో పాటు తెలుగు, ఇంగ్లీషు భాషల స్టడీ మెటీరియల్​తో పాఠాలు చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం గోశాలే అంగన్​వాడీకి మారిన లక్ష్మీ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తున్నారు. తమ పిల్లలను సైతం ఈ పాఠశాలలో చేర్పించేందుకు ఇతర గ్రామాలకు చెందిన తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version