శివ కుమార్ Vs సిద్ధ రామయ్య.. కర్ణాటక నెక్స్ట్ సీఎం ఎవరు..?

-

కర్ణాట‌క అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమైనట్లు కనిపిస్తోంది. తాజా కౌంటింగ్‌లో ఆ పార్టీ 122 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవ‌రు సీఎం అవుతార‌న్న‌దే కీల‌కంగా మారింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ లేదా సీనియ‌ర్ సిద్ధిరామ‌య్య.. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు సీఎం పోస్టును చేజిక్కించుకుంటారో క్లారిటీ లేదు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇద్దరూ పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. క‌ర్ణాట‌క సీఎంగా సిద్ధిరామ‌య్య‌కే ఎక్కువ ఛాన్సు ఉంద‌ని పార్టీలోని వ‌ర్గాలు చెబుతున్నాయి. కానీ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ మ‌ళ్లీ పుంజుకోవ‌డం కోసం డీకే శివ‌కుమార్ తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డారు. అయితే శివ‌కుమార్‌కు మంచి పోస్టే ద‌క్కుతుంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ఇద్ద‌రి మ‌ధ్య ప‌వ‌ర్ షేరింగ్ ఫార్ములా కుదిరిన‌ట్లు తెలుస్తోంది. డీకే శివ‌కుమార్‌కు తొలుత ఓ ఉన్న‌త పోస్టు ఇచ్చినా.. ఆ త‌ర్వాత ఆయ‌నే ఆ రాష్ట్ర సీఎం అవుతార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version