కరోనా: ఆ రెండు రాష్ట్రాల వారికి షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం..

-

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ అనేక నియమ నిబంధనల నడుమ ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి రాకపోకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు ఎక్కువ అవుతున్నాయని వినిపిస్తున్న తరుణంలో రెండు రాష్ట్రాల నుండి వచ్చేవారికి కరోనా నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి చేసింది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుండి కర్ణాటక వచ్చే వారందరూ ఆర్టీ పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని తెలిపింది.

కరోనా నెగెటివ్ రిపోర్టు ఉంటేనే కర్ణాటకలోకి అనుమతి ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కర్ణాటక ఆరోగ్య మంత్రి సుధాకర్ ప్రకటించిననట్టు కన్నడ పత్రిక ఉదయవాణి ప్రచురించింది. సరిహద్దుల్లో ఉన్న అన్ని జిల్లాలకు ఈ సమాచారాన్ని పంపించారు. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ప్రకారం, ఇప్పటి వరకు 12రాష్ట్రాల్లో 51డెల్టా ప్లస్ కేసులు నమోదు అయ్యాయి. అందులో మహారాష్ట్రలో 22, కేరళలో 5కేసులు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version