మా ఉద్యోగాలు మాకే కావాలి.. ఉద్యోగాల కోసం హీరో ఉపేంద్ర ఉద్య‌మం

-

రాజకీయాల‌పై త‌నదైన గ‌ళం వినిపించే క‌న్న‌డ హీరో ఉపేంద్ర మ‌రోసారి త‌న గ‌ళాన్ని వినిపించ‌నున్నారు. స్థానిక నిరుద్యోగుల‌కు క‌ల్పించాల్సిన ఉద్యోగాల కోసం ఆయ‌న ఉద్య‌మం ప్రారంభించ‌నున్నారు.  బెంగళూరు ఐటీ రాజధానిలో స్థానికుల‌కే ఉద్యోగాలు క‌ల్పించ‌క‌పోవ‌డం ప‌ట్ల ఆయ‌న మండిప‌డుతున్నారు.  ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ఇటీవలి కాలంలో ఉపేంద్ర గట్టిగానే పోరాటం చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ ట్వీట్లు కూడా పెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపైనా ఆయన మాట్లాడారు. దీంతో పాటు ఈనెల 9న అవినీతిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి అవినీతిని అంతం చేయవచ్చని తెలిపారు.

ఉద్యోగాలు క‌ల్పించాల‌ని ఆయ‌న విడుద‌ల చేసిన వీడియోలో ఏముందంటే..  ‘కర్ణాటకలో ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలి. దీని గురించి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం జరుగుతోంది. రాష్ట్రంలోని ఉద్యోగాల్లో వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అందరి ఆకాంక్ష కూడా. ఇందుకోసం నేను పోరాటం చేస్తాను. ఈ మేరకు ఈ నెల 14, 15 తేదీల్లో గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తాను. ఇందుకు నాకు యువత మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాను.  నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను’ అని ఉపేంద్ర వీడియోలో చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news