కార్తీకమాసంలో దీపారాధన చేసేటప్పుడు ఈ విషయాలను మరచిపోకండి..!

-

కార్తీక మాసం అంతటా కూడా హిందువులు పూజలు చేసి పరమశివుడిని కొలుస్తారు. తెలుగు మాసాల్లో ఎనిమిదవ మాసమైన కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న మాసం. శివుడికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసంలో ఉపవాసం, రుద్రాభిషేకం, బిల్వ పూజ, విష్ణు విష్ణు సహస్రాబ్ది ఆరాధన చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది.

మనం చేసిన పాపాలను తొలగించి విముక్తి చేస్తుందని కార్తీక మాసం లో ఇలాంటివి అనుసరిస్తూ వుంటారు భక్తులు. దీపం వెలిగిస్తే మన మనసు చీకటి, అజ్ఞానం, కోపం, దురాశ, అసూయ, ద్వేషం, పగ వంటి వాటిని తొలగిస్తుంది. అందుకొని కార్తీక మాసంలో తెల్లవారుజామున దీపారాధన చేస్తారు.

దీపారాధన చేసేటప్పుడు వీటిని మర్చిపోవద్దు:

దీపం పెట్టేటప్పుడు మట్టితో తయారు చేసిన ప్రమిదల్లోనే వెలిగించాలి. ఎందుకంటే ప్రమిద మన శరీరానికి ప్రతీకగా ఉంటుంది.
అలానే దీపం పెట్టేటప్పుడు ముందు ఒత్తు వెయ్యకూడదు. మొదట ప్రమిద వేసి ఆ తరవాత ఒత్తు వెయ్యాలి. అంతే కానీ ముందు నూనెను లేదా నెయ్యిని వేయకుండా ఒత్తు వెయ్యకూడదు.
అలానే దీపాన్ని వెలిగించేటప్పుడు మొదట ఒక దీపం వెలిగించి తరవాత ఆ దీపం సహాయంతో మరొక దీపాన్ని వెలిగించాలి.
ఐదు దీపాలను కొందరు వెలిగిస్తారు. దాని అర్ధం ఏమిటో ఇప్పుడు చూద్దాం. తొలి వత్తు భర్తకు, పిల్లలకు, రెండోది కుటుంబ సభ్యుల క్షేమం కోసం, మూడవది సోదర సోదరీమణుల క్షేమంకు, నాల్గవది ధర్మానికి ప్రతీకగా, అయిదవది వంశ పురోగతికి ప్రతీకగా పరిగణిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news