ఓటీటీలోకి వచ్చేసిన కార్తి ‘సర్దార్‌’..

-

సూర్య తమ్ముడిగా చిత్రపరిశ్రమకు పరిచయమైన కార్తి తన దైన నటన శైలితో ముందుకు దూసుకుపోతున్నాడు. కోలీవుడ్‌కు సమానంగా తెలుగులో క్రేజ్‌ తెచ్చుకున్న కార్తి.. కెరీర్‌ బిగెనింగ్‌ నుండి విభిన్న సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల్లో మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఈ ఏడాది కార్తి ఏకంగా మూడు సినిమాలను రిలీజ్‌ చేశాడు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయాలు సాధించాయి. దీపావళి కానుకగా కార్తి నటించిన ‘సర్దార్‌’ రిలీజై బాక్సాఫీస్‌ దగ్గర వంద కోట్ల కలెక్షన్‌లు సాధించింది. ‘విరుమన్‌’, ‘PS-1’ వంటి వరుస హిట్ల తర్వాత అదే జోరులో ‘సర్దార్‌’ వచ్చి హ్యట్రిక్‌గా నిలిచింది. పీఎస్‌. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలై కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది.

ఇక ఈ సినిమా డిజిటల్‌ రిలీజ్‌ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా సర్దార్‌ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో గత నుండి స్ట్రీమింగ్‌ అవుతుంది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో కార్తి డ్యూయల్ రోల్‌లో నటించాడు. తండ్రి, కొడుకుగా మంచి నటనను కనబరిచాడు. కార్తికి జోడీగా రాశిఖన్నా, రజిషా విజయన్‌ నటించారు. లైలా, చంకీ పాండే కీలకపాత్రలు పోషించారు. తెలుగులో ఈచిత్రాన్ని అన్నపూర్ణ స్టూడీయోస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున రిలీజ్‌ చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version