ఏపీలో ఛాన్స్‌లో గోల ఎక్కువైపోయింది…ప్రజలని సెంటిమెంట్‌తో పడగొట్టి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు చూస్తున్నాయి. ఎవరికి వారే ఒక్క ఛాన్స్, చివరి ఛాన్స్, మరొక్క ఛాన్స్ అంటూ ప్రజలని ఆకట్టుకోవడానికి చూస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే, ఇప్పటినుంచే ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్…ఒక్క ఛాన్స్ అని అడిగి అధికారంలోకి వచ్చారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలని ఓట్లు అడిగారు.
ప్రజలు సైతం చంద్రబాబు పాలన ఎలాగో చూశాం కదా అని, జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు జగన్ పాలన ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారు. జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేసేవారు ఉన్నారు..అసంతృప్తి వ్యక్తం చేసేవారు ఉన్నారు..కానీ జగన్ మాత్రం మనం అంతా మంచే చేశాం..98 శాతం హామీలు అమలు చేశాం..90 శాతం ప్రజలకు పథకాల ద్వారా లబ్ది చేకూరింది..ఇంకా ప్రజలంతా మనవైపే ఉంటారు..175కి 175 సీట్లు గెలిచేయాలని, మరొక్క ఛాన్స్ ఇస్తే..ఇంకా 30 ఏళ్ల పాటు మనదే అధికారమని జగన్ అంటున్నారు.
ఇటు చంద్రబాబు వచ్చేసరికి..ఇప్పటికే ఆయన మూడుసార్లు సీఎంగా పనిచేశారు..అయితే నెక్స్ట్ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అన్నట్లు పోరాడుతున్నారు. జగన్ పాలనలో రాష్ట్రం నాశనం అయిందని, తాను మళ్ళీ సీఎం అయితే..అప్పులు చేసి కాకుండా ఆదాయం సృష్టించి.. ఏ ఒక్క పథకం కట్ చేయకుండా ఇంతకంటే మెరుగ్గా సంక్షేమం అందిస్తూనే..అభివృద్ధి కూడా చేస్తానని అంటున్నారు.
ఇప్పుడు గాని గెలిపించుకోలేకపోతే…ఇవే తనకు చివరి ఎన్నికలు అని బాబు అంటున్నారు. అంటే గెలిస్తే ఓకే..లేదంటే ఇవే చివరి ఎన్నికలు అని చెప్పి బాబు కూడా సెంటిమెంట్‌తో కొడుతున్నారు. జగన్-బాబు వర్షన్ ఇలా ఉంటే..పవన్ సైతం అవినీతి లేని పాలన అందిస్తామని, తమకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అంటే జగన్ ఏమో మరొక్క ఛాన్స్ అంటారు..బాబు ఏమో చివరి ఛాన్స్ అంటారు..పవన్ ఏమో ఒక్క ఛాన్స్ అంటారు. ఇలా ఎవరికి వారే ప్రజలని ఛాన్స్ అడుగుతున్నారు..మరి వీరిలో ప్రజలు ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది చూడాలి.