లైంగిక వేధింపులు ఆడ‌వాళ్లపై…మ‌గాళ్లపై కాదు బాస్! కౌశ‌ల్

-

బిగ్ బాస్ 3 లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటున్న సంగ‌తి తెలిసిందే. లేడీ కంటెస్టెంట్ల‌ను క‌మిట్ మెంట్ అడుగుతూ ప‌డ‌క సుఖం తీర్చుకుంటున్నార‌ని తీవ్ర స్థాయిలో శ్వేతారెడ్డి, గాయ‌త్రి గుప్తా ద్వ‌జ‌మెత్తారు. వీళ్లికి తోడుగా కేతిరెడ్డితో పాటు ఓయూ విద్యార్ధి సంఘాల నాయ‌కులు కూడా రంగంలోకి దిగ‌డంతో బిగ్ బాస్ కు టెన్ష‌న్ ప‌ట్టుకుంది. అయితే నిన్న‌టి రోజున బిగ్ బాస్-3 కి హైకోర్టులో తాత్కాలికంగా ఊర‌ట ల‌భించినా స‌రైన ఆధారాలు గ‌నుక స‌మ‌ర్పిస్తే బిగ్ బాస్ క‌థ స‌మాప్తం అని చాలా మంది భావిస్తున్నారు. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈనెల 24కు వాయిదా వేసింది దీంతో గాయ‌త్రి గుప్తా, శ్వేతారెడ్డి, జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ఆధారాలు సేక‌రించే ప‌నిలో ఉన్నారు. ఇటు బిగ్ బాస్ నిర్వాహ‌కులు, అభిషేక్ ముఖ‌ర్జీ అండ్ టీమ్ ఎలాగైనీ క్లీన్ చీట్ తో బ‌య‌ట‌కు రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

kaushal manda respond on bigg boss-3

ఈ నేప‌థ్యంలో కొద్ది సేప‌టి క్రిత‌మే బిగ్ బాస్ -2 విజేత కౌశ‌ల్ బిగ్ బాస్ పై క్లీన్ చీట్ ఇచ్చాడు. బిగ్ బాస్ -2 విజేత‌గా, ఓ సామాన్యుడిగా నాకు షోపై ఎంతో అవ‌గాహ‌న ఉంది. ఈ కార్య‌క్ర‌మం ఎంపిక చేసే ప్ర‌క్రియ ఎంతో నిజాయితీగా సాగుతుంది. ఎలాంటి త‌ప్పుడు ప‌నులు జ‌ర‌గ‌వు. బిగ్ బాస్ సీజ‌న్-3లో పాల్గొనే వారంద‌కికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. దీంతో కొంద‌రు లేడీ నేటి జ‌నులు కౌశ‌ల్ పై సీరియ‌స్ అయ్యారు. లైంగిక బాధింప‌డేది మ‌గ‌వాళ్లు కాదు. ఆడ‌వాళ్లు బాస్. బిగ్ బాస్ వాళ్లు నిన్ను విజేత‌ను చేసార‌ని చంకలు గుద్దుకుని ఈ మాట‌లు చెబుతున్న‌వా? లేక సీజ‌న్ విజేత‌ని వాళ్లే నీతో ఇలా మాట్లాడించ‌రా? అని కౌంట‌ర్లు వేస్తున్నారు. కంగారు ప‌డ‌కండి మీ బిగ్ బాస్ రాస‌లీల‌ బాగోతం అతి త్వ‌ర‌లోనే ఆధారాల‌తో స‌హా బ‌య‌ప‌డుతుంది. అప్పుడు ఏం మాట్లాడుతారో? వింటామ‌ని బిగ్ బాస్ వ్య‌తిరేఖ వ‌ర్గం సీరియ‌స్ అయింది.

కౌశ‌ల్ ఫేక్ ఆర్మీ సృష్టించి విజేత‌గా నిలించాడ‌ని సీజ‌న్-2 కంటెస్టెంట్లు ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. వాటికి కొన్ని ఆధారాలు కూడా చూపించారు. ఇదే స‌మ‌యంలో కౌశ‌ల్ కొన్ని ఇంట‌ర్వూల‌లో పిఎం ఆఫీస్ ని ఫోన్ చేసి అభినంద‌న‌లు తెలిపార‌ని, గిన్సీస్ బుక్ ఎక్కుతున్నాన‌ని అన్నాడు. కానీ అది ప‌చ్చి అబ‌ద్దమ‌ని పిఎం కార్యాల‌యం వివ‌ర‌ణ ఇచ్చింది. దీంతో అబ‌ద్దం చెప్పాన‌ని కౌశ‌ల్ ఒప్పుకున్న సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news