కౌషిక్ రెడ్డి కి షాకిచ్చిన తెలంగాణ గవర్నర్ !

టీఆర్‌ఎస్‌ నేత కౌశిక్‌ రెడ్డి కి ఊహించని షాక్‌ ఇచ్చింది తెలంగాణ గవర్నర్‌ తమిళ్‌ సై. తెలంగాణ గవర్నర్‌ గా బాధ్యతలు చేపట్టి.. రెండు సంవత్సరాలు అయిన నేపథ్యం లో మీడియాతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా కౌశిక్‌ రెడ్డి ఎమ్మెల్సీ పదవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌషిక్ రెడ్డి ని గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడం పై గవర్నర్ తమిళ్‌ సై అసంతృప్తి వ్యక్తం చేశారు.

సమాజిక సేవ చేసిన వాళ్ల కే ఎమ్మెల్సీ ఇవ్వాలి కానీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదన పై ఆలోచించాలని తెలంగాణ సర్కార్‌ కు చురకలు అంటించారు. కౌషిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. కౌశిక్ రెడ్డి ఫైల్ తన దగ్గరే ఉందని… తానున ఇంకా ఒకే చెప్పలేదని తెలిపారు గవర్నర్‌ తమిళ్‌ సై. హుజురాబాద్‌ ఉప ఎన్నిక వరకు ప్రకటిస్తారన్న విలేకరి ప్రశ్న కు… మీకు నచ్చింది రాసుకోండి అని గవర్నర్‌ తమిళ్‌ సై సమాధానం ఇచ్చారు. ఇక గవర్నర్‌ వ్యాఖ్యలతో హుజురాబాద్‌ ఉప ఎన్నికలు మరింత వేడేక్కాయి.