వీడెవడండీ బాబూ : మహిళల 700 ల లోదుస్తులు చోరీ !

జపాన్‌ ఎంత అభివృద్ధి చెందిన దేశమో అందరికీ తెలిసిందే. ఆ దేశం లో ప్రతీ ఇంట్లో.. దాదాపుగా వాషింగ్‌ మెషిన్లు ఉంటాయి. వీధుల్లోనూ కాయిన్‌ లాండ్రీలు కూడా ఉంటాయి. అయితే.. జపాన్‌ లోని బెప్పు నగరంలో లాండ్రీకి వేసిన అండర్‌ వేర్స్‌ ఎత్తుకెళుతున్నాడట ఓ దొంగ. ఇదేంటీ బాబు.. ఇంత అమయాకుడా అనుకోకండి.. అతడి వృత్తే.. మహిళల లోదుస్తులను ఎత్తుకెళ్లడం. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఆ దొంగ పేరు టెట్సువో ఉరతా. ఇతను తరచు అండర్‌ వేర్లు దొంగిలిస్తుంటాడు.

ఇప్పటి వరకు 700 డ్రాయర్లు లేపేశాడు. అయితే.. ఇందులో అన్ని మహిళలు వాడేసిన అండర్‌ వేర్లు కావడం విశేషం. ఈ విషయం పోలీసుల విచారణ బయట పడింది. అదే నగరానికి చెందిన ఓ యువతి ఆరు జతల లో-దుస్తులు.. లాండ్రికి వేసింది. అయితే.. అవి కనిపించకపోయే సరికి.. ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలు పరిశీలించారు. దీంతో అసలు దొంగ టెట్సు పోలీసులు పట్టుబడ్డాడు. టెట్సువోను పట్టుకుని.. తన ఇంటికి తీసుకెళ్లారు పోలీసులు. ఇక అక్కడ అప్పటికే 700 కు పైగా లో దుస్తులు ఉన్నాయి. దీంతో పోలీసులు కూడా షాక్‌ అయ్యారు. ఇక ఘటన సంబంధించిన పోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.