కేంద్ర ప్రభుత్వం, బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సవతి తల్లి ప్రేమ మరోసారి బయటపడిందని నిప్పులు చెరిగారు. యాసంగిలో తెలంగాణలో అధిక శాతం బాయిల్డ్ రైస్ ( ఉప్పుడు బియ్యం ) మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి తెలిసినా, రా రైస్ మాత్రమే కొంటామంటూ మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని అగ్రహించారు.
రైతులు పండించే పంటను కొనకుండా, పండని పంటను కొంటామంటూ ప్రకటించి బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తెలంగాణ వ్యవసాయం గురించి ఏ మాత్రం అవగాహన లేని బండి సంజయ్ గారు,యాసంగిలో రాష్ట్రంలో ఏ రకం బియ్యం ఉత్పత్తి అవుతాయో తెలుసుకోండని ఎద్దేవా చేశారు కల్వకుంట్ల కవిత చురకలు అంటించారు. మీకు తెలియకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతును అడిగినా మీకు జ్ఞానోదయం చేయిస్తారని మండి పడ్డారు. మీ అర్థ జ్ఞానంతో అన్నదాతలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు కల్వకుంట్ల కవిత.