దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధమున్న వారందరిని విచారించింది. తాజాగా ఈ కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రు కేసులో ఈడీ తాజాగా దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డిల పేర్లు కనిపించాయి. వీరితోపాటు ఈ మొత్తం వ్యవహారంలో బోయినపల్లి అభిషేక్, బుచ్చిబాబు, అరుణ్‌పిళ్లైలు పోషించిన పాత్రల గురించీ ఇందులో చెప్పారు. ఇప్పటివరకు అరెస్టయిన సమీర్ మహేంద్రు, పి.శరత్‌చంద్రారెడ్డి, బినయ్‌బాబు, విజయ్‌నాయర్, బోయినపల్లి అభిషేక్‌ల ద్వారా తీసుకున్న స్టేట్‌మెంట్ల ఆధారంగా ఈడీ ఈ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
10 వేల కోట్ల ఆదాయం ఉన్న మద్యం వ్యాపారాన్ని చేజిక్కుంచుకోవడం కోసం వంద కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారాయని ఛార్ఙిషీట్‌లో పేర్కొంది. గత నెల 26న దాఖలు చేసిన మూడు వేల పేజీల ఛార్జిషీటులో పొందుపరిచిన వివరాలతో కూడిని ప్రాసిక్యూషన్ కంప్లైంట్ కాపీని కోర్టుకు అందించింది. ఇది తాజాగా బయటికి రావడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.