తెలంగాణ జాగృతి భగ్గుమంది. కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసిన అన్యాయానికి నిరసనగా, హరీష్ రావు దిష్టిబొమ్మ దహనం చేసారు తెలంగాణ జాగృతి నాయకులు. తెలంగాణ జాగృతి కార్యాలయం దగ్గర హరీష్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు తెలంగాణ జాగృతి నేతలు.

అటు కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న. పార్టీకి ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు… క్రమశిక్షణకు మారు పేరు బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. కవిత సస్పెన్షన్ తో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ సంతృప్తితో ఉన్నారు… ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కవితను సస్పెండ్ చేయడం అవసరమే అన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న. అటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో కవిత పోస్టర్లు, బ్యానర్లు తీసేస్తున్నారు పార్టీ శ్రేణులు.