ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసినందుకు .. తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు సోష మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దింతో అప్పుడే బీఆర్ఎస్‌పై ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టిందని ఎమ్మెల్సీ కవిత వర్గంకు కౌంటర్ ఇస్తోంది గులాబీ సోషల్ మీడియా. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడాన్ని జీర్ణించుకోలేక.. వాట్సాప్‌లో తప్పుడు ప్రచారం ప్రారంభం అయిందని గులాబీ సోషల్ మీడియా చెబుతోంది.

ఐదేళ్ల క్రితం తెలంగాణ భవన్‌లో జరిగిన అగ్నిప్రమాదం వీడియోని ఇప్పుడు నెట్టింట్లో షేర్ చేస్తూ.. ఈ రోజు ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు. దేవనపల్లి కవిత వర్గం నుండి ఈ ఫేక్ న్యూస్ బెడద మొదలైందని.. బీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టింది. అటు తెలంగాణ జాగృతి భగ్గుమంది. కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసిన అన్యాయానికి నిరసనగా, హరీష్ రావు దిష్టిబొమ్మ దహనం చేసారు తెలంగాణ జాగృతి నాయకులు. తెలంగాణ జాగృతి కార్యాలయం దగ్గర హరీష్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు తెలంగాణ జాగృతి నేతలు.