మేడారం మహా జాతర వెబ్ సైట్‌లో సీఎం హోదాలో కేసీఆర్

-

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.  అయితే త్వరలో జరిగే సమ్మక్క, సారలమ్మ మేడారం మహా జాతర పనులకు సంబంధించిన పనుల పర్యవేక్షణలో అధికారుల వైఫల్యం మరోసారి తీవ్ర విమర్శలకు తావిచ్చింది . అధికారులు ఈ విమర్శలకు బలం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. 2024 మహా జాతరకు సంబంధించి ఏర్పాట్లు జాతర విశేషాలు సమగ్రమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన మేడారం మహా జాతర వెబ్‌ సైట్‌లో మాజీ సీఎం చంద్రశేఖర రావు ఫొటోలు ఉండటం అధికారుల పర్యవేక్షణ వైఫల్యానికి నిదర్శనంగా భక్తులు తెలుపుతూ ఉన్నారు.

 

వెబ్ సైట్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పనితీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు తప్పిదాన్ని గుర్తించి మేడారం మహా జాతర వెబ్ సైట్‌లో మాజీ సీఎం చంద్ర శేఖర్ రావు ఫోటోలు తొలగించి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలను అప్డేట్ చేస్తారో లేదో వేచి చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news