విశాఖలోని వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో టీం ఇండియా,ఇంగ్లాండ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టెస్టు మ్యాచ్లో యశస్వీ జైస్వాల్ (207 నాటౌట్) డబుల్ సెంచరీ చేశాడు. ఓవర్ నైట్ స్కోర్ 179తో రెండో రోజు క్రీజులోకి వచ్చిన జైశ్వాల్ తొలి సెషన్ మొదలైన కాసేటికే తన వ్యక్తిగత స్కోరును 200 పరుగులు దాటించాడు.
టీమ్ ఇండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ (209)కి మితిమీరిన ప్రచారం కల్పించవద్దని గౌతమ్ గంభీర్ కోరారు. ‘ఇండియాలో అందరికీ ఓ లక్షణం ఉంది. ఒక మ్యాచ్లో బాగా ఆడగానే ఆకాశానికి ఎత్తేస్తారు. బిరుదులు తగిలించి హీరోలను చేస్తారు. ఇలాంటి ప్రచారం ప్లేయర్పై ఒత్తిడిని తీసుకొస్తుంది. సహజసిద్ధమైన ఆట ఆడలేరు. జైస్వాల్ కు ప్రస్తుతం 22 ఏళ్లే. అతడి విషయంలో సంయమనంతో వ్యవహరించాలి’ అని గంభీర్ సూచించారు.
ఇదిలా ఉంటే…రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా ఇండియా 28 రన్స్ చేసింది. దీంతో ఇండియా ఆధిక్యం ఓవరాల్‌గా 171 రన్స్ కు చేరింది. ప్రస్తుతం క్రీజులో యశస్వీ జైస్వాల్ 17, రోహిత్ శర్మ 13 ఉన్నారు.