పరేడ్ గ్రౌండ్స్:  మీరు ఆంధ్రావాళ్లు కాదు..హైదరాబాదీలు..

-

హైదరాబాద్ లో ఉండే ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు తమకు తామే ఆంధ్రావాళ్లమంటూ ఎందుకు చెప్పుకుంటున్నారని తెరాస అధినేత కేసీఆర్ ప్రశ్నించారు.  హైదరాబాద్‌ విశ్వనగరమని, ఇది ఏ ఒక్కరి సొత్తూ కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఆదివారం పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… ‘‘హైదరాబాద్‌కు ఎప్పుడో తాతలు, తండ్రుల కాలంలో చేరుకున్నవారు ఇక్కడ లక్షల్లో ఉన్నారు.. వాళ్లు ఏ ప్రాంతీయులు అని చూడకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చాం. వాళ్లలో చాలా మంది గెలిచారు. ఇక్కడ చిల్లర రాజకీయాలు లేవు. ప్రజలను ప్రజలుగానే చూస్తున్నాం. వారందరికీ కూడా నా విన్నపం ఒక్కటే. ‘మేము వేరు. ఆంధ్రా వాళ్లం’ అనే భావన వీడండి.

హైదరాబాదీగా ఉండండి. హైదరాబాదీగా ఉన్నందుకు గర్వపడండి. కేసీఆర్‌ మీతో ఉన్నాడు అంటూ భరోసా ఇచ్చాడు. నేను పాత మెదక్ ‌జిల్లాకు చెందిన వాడిని. ఇక్కడకు వచ్చి ఉంటున్నా. అందరం ప్రశాంతంగా జీవిస్తున్నాం. గత నాలుగున్నరేళ్లలో ఒక్క గొడవ కూడా ఇక్కడ జరగలేదు. భవిష్యత్ అవసరాల కోసం  హైదరాబాద్‌ మహానగరంలో తాగునీటి వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రెండు రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. ఈ సందర్భంగా 24 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news