కవచం ట్రైలర్ టాక్.. పోలీస్ ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తా..!

-

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ మామిళ్ల డైరక్షన్ లో వస్తున్న సినిమా కవచం. వంశధార క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్ నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది. సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ గా కనిపిస్తున్నాడు.

ఇప్పటిదాకా క్రిమినల్ ఆడే ఆట చూశాం.. ఇక పోలీస్ ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ శ్రీనివాస్ పవర్ ఫుల్ డైలాగ్ బాగుంది. పద్మవ్యూహంలో చిక్కుకోడానికి నేను అభిమన్యుడిని కాదు పోలీస్ అంటూ చివర్లో ఫైర్ తో చెప్పిన డైలాగ్ అలరించాయి. సినిమా ట్రైలర్ చూస్తే తన మీద పడ్డ నింద తొలగించుకునేందుకు ఓ పోలీస్ ఏం చేశాడు అన్నది కథ అని తెలుస్తుంది.

కాజల్, మెహ్రీన్ ఇద్దరు గ్లామర్ భామలు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇక సినిమాకు తమన్ మ్యూజిక్ కూడా ప్లస్ అవుతుందని అంటున్నారు. డిసెంబర్ 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news