ప్రతిపక్షాలు చేస్తున్న దళిత ముఖ్యమంత్రి హామీ విమర్శపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తారని 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే ఆ తదనంతరం కేసీఆరే ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. దీనిపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తామని చేయలేదు ఇది వాస్తవం అని కేసీఆర్ అన్నారు. అరిగిపోయిన రికార్డ్ లా బీజేపీ ఎప్పుడూ ఇదే విమర్శ చేస్తుందని విమర్శించారు. ఎక్స్పైర్ అయిన మెడిసిన్ లా ప్రతిపక్షాలు ఎప్పడు ఇదే విమర్శ చేస్తున్నారని విమర్శించారు. కొన్ని కారణాల చేత దళితున్ని ముఖ్యమంత్రి చేయలేదన్నారు. దీనికి ఆమోదంగా 2018 లో మరింత మెజారిటీ ఇచ్చి తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారన్నారు. తెలంగాణలో ఏమూలకు వెళ్లినా గెలిచా అని అన్నారు. సొంత నియోజకవర్గాన్ని వదిలి, కరీంనగర్, మహబూబ్ నగర్ లలో పోటీ చేస్తే ప్రజలు గెలిపించారని అన్నారు. ప్రస్తుతం గజ్వేల్ నుంచి కూడా ప్రజలు ఆశీర్వదించారన్నారు. మీకు సహకరించకుంటే ఈడీ, ఐటీ దాడులు చేస్తారని బీజేపీని విమర్శించారు. దొంగలు భయపడుతారు.. మేం ఎందుకు భయపడుతాం అని బీజేపీని ఉద్దేశించి అన్నారు.