టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలని కోరుకునే పార్టీ టీఆర్ఎస్ అని కేసీఆర్ చెప్పారు. గతంలో ఏపీ పర్యటనపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా కౌంటర్ ఇచ్చారు. పక్క రాష్ట్రానికి వెళ్లి చేపల పులుసు తిన్నాడనే బండి వ్యాఖ్యలకు బరాబర్ తింటా.. తింటే తప్పా అని కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ వెనుకబడిన కరువు ప్రాంతం కాబట్టే నీళ్లు ఇవ్వాలని కోరాం అని కేసీఆర్ అన్నారు. మేం ఇప్పుడు కూడా ఇదే చెబుతున్నాం… తెలుగు రాష్ట్రాల్లో కరువు ప్రాంతాలకు నీరు ఇవ్వాలని మేం గతంలో చెప్పాం..ఇప్పుడు కూడా చెబుతున్నాం అని స్పష్టం చేశారు.
క్రిష్టా నదిలో నీరు లేవని.. గోదావరిలో మాత్రమే ఉన్నాయని.. మేం కూడా గోదావరి నుంచే నీటిని తెచ్చుకుంటున్నామని..మీరు కూడా గోదావరి నుంచే తెచ్చుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ కూడా సూచించామన్నారు. బీజేపీ పార్టీకి ఎన్నికల ముందే నదుల అనుసంధానం గుర్తుకు వస్తుందని విమర్శించారు. గతంలో తమిళనాడు ఎన్నికల ముందు కావేరీ అనుసంధానం అన్నారు… ఎన్నికల తరువాత పక్కన పెట్టారని విమర్శించారు.