వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలను ఎంపీ పురందేశ్వరి ఖండించారు. పోలీసులు ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగా కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకుంటారని..శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
అలాంటి వాళ్లను పట్టుకొని జగన్ బట్టలూడదీసి కొడతాననడం సమంజసం కాదని ఆమె విమర్శించారు. పోలీస్ వ్యవస్థలో 5 వేల మంది మహిళలు ఉన్నారని.. జగన్ వెంటనే మొత్తం పోలీసు వ్యవస్థకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీ పురందేశ్వరి డిమాండ్ చేశారు. కాగా, జగన్ వ్యాఖ్యలను ఏపీ పోలీసు శాఖ కూడా తీవ్రంగా ఖండించింది.