తెలంగాణా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ లో గుడి, మసీదు, చర్చిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత గంగా జమునా తహజీబ్ కు అద్దం పట్టేలా ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేసి, త్వరిత గతిన నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. కొత్త సెక్రటేరియట్ లో మసీదుల నిర్మాణం, ఇతర అంశాలపై ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు అంశాల మీద వారితో చర్చించారు.
, kcr
నిజానికి పాత సెక్రటేరియట్ కూలుస్తున్నప్పుడు అదే ప్రాంగణంలో ఉన్న ఎల్లమ్మ గుడి, మసీదులు ద్వంశం అయ్యాయి. అందుకే ఇప్పుడు వాటిని ప్రభుత్వమే నిర్మించనుంది. అయితే అప్పుడు చర్చ్ లేకున్నా కొత్త సెక్రటేరియట్ ప్రాంతంలో తమకు కూడా ప్రార్థనా మందిరం కావాలన్న క్రిస్టయన్ల కోరిక మేరకు చర్చిని కూడా ప్రభుత్వం నిర్మించనుంది. ఈ సమావేశంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మెంబర్ మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్ సాహబ్ లాంటి ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.