ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల్లో అధికారులు ఎక్కడి కక్కడ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రతిరోజు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో, నగరంలో రేపు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కంప్లీట్ లాక్ డౌన్ విధిస్తూ కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు.

నెల్లూరు జిల్లా గూడూరులోనూ జనతా కర్ఫ్యూకి ఆదేశాలిచ్చారు అక్కడి స్థానిక అధికారులు. రోజురోజుకూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ఏపీ వాసుల్లో ఆందోళన నెలకొందని చెప్పచ్చు. అక్కడ రోజూ పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. సామాన్య జనంతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా కరోన బారిన పడుతున్నారు.