గులాబీకి కొత్త గుబులు..అందరూ దూరమే?

-

రోజురోజుకూ కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది…గతంలో ఉన్న పరిస్తితులు ఇప్పుడు కనిపించడం లేదు..ఇప్పుడు ప్రతిదీ కేసీఆర్‌కు వ్యతిరేకంగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మామూలుగా తనకు ఎదురే ఉండకూడదని చెప్పి కేసీఆర్ ప్రతిపక్షాలని తోక్కేశారు. కానీ బీజేపీ రూపంలో కేసీఆర్‌కు కొత్త ప్రత్యర్ధి ఎదురైంది. ఇక బీజేపీ..టీఆర్ఎస్‌కు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.

TRS-Party | టీఆర్ఎస్

అలాగే బీజేపీ బలపడుతుంటే…టీఆర్ఎస్ వీక్ అవుతూ వస్తుంది. అయితే ఇంతకాలం టీఆర్ఎస్‌కు మద్ధతుగా ఉంటున్న వారు కూడా నిదానంగా దూరమవుతున్నారు. ఇంతకాలం తెలంగాణ తెచ్చిన పార్టీగా అన్నీ వర్గాలు టీఆర్ఎస్‌ని ఆదరిస్తూ వచ్చాయి. కానీ తెలంగాణ వచ్చాక కూడా పలు వర్గాలు బాగుపడలేదు. దానికి కారణం కేసీఆర్ ప్రభుత్వమే అన్నట్లు పరిస్తితి ఉంది.

అసలు మొదట టీఆర్ఎస్‌కు దూరమైంది ఉద్యమకారులు…టీఆర్ఎస్‌లో ఉద్యమకారులకు పెద్ద ప్రాధాన్యత లేని విషయం తెలిసిందే. తెలంగాణ కోసం పోరాడని వారికి ప్రాధాన్యత ఇచ్చారు గానీ..పోరాడిన వారికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో ఉద్యమకారులు పార్టీకి దూరమయ్యారు. అలాగే సామాజికవర్గాల పరంగా చూసుకుంటే రెడ్డి వర్గం మాత్రం కేసీఆర్‌కు ఇంకా వ్యతిరేకమవుతుంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలని లాగేసి రెడ్డి వర్గాన్ని దగ్గర చేసుకోవాలని చూశారు గానీ..అదంతా వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు. ఇక ఈటల రాజేందర్ ఎపిసోడ్‌తో ముదిరాజ్‌లు సైతం టీఆర్ఎస్‌కు దూరం జరిగారు. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత వారు పూర్తిగా టీఆర్ఎస్‌ని వ్యతిరేకిస్తున్నారు. ఇక సీనియర్ నేత డి. శ్రీనివాస్ ప్రభావంతో మున్నూరు కాపులు సైతం కేసీఆర్‌కు యాంటీ అయ్యారు. అలాగే గిరిజనులు, మాదిగలు లాంటి వర్గాలు కూడా టీఆర్ఎస్‌కు దూరంగానే ఉన్నాయి.

అసలు మాదిగ వర్గానికి కేసీఆర్ క్యాబినెట్‌లో పెద్దగా ప్రాధాన్యత లేని విషయం తెలిసిందే. అటు కమ్మ వర్గం కూడా నిదానంగా టీఆర్ఎస్‌కు దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ తర్వాత వారు టీఆర్ఎస్‌కు మద్ధతు ఇచ్చారు..ఇప్పుడు వారు కూడా దూరమవుతున్నారు. ఇలా అన్నీ వర్గాలు కేసీఆర్‌కు యాంటీ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version