ప్రైవేట్ టీచర్స్ కు కేసీఆర్ గుడ్ న్యూస్

Join Our Community
follow manalokam on social media

వరుసగా తెలంగాణలో ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్య చేసుకుంటున్న తరుణంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో  ఇబ్బందులు ఎదుర్కొంటున్న, గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ.2000 ఆపత్కాల  ఆర్థిక సాయంతో  పాటు  కుటుంబానికి  25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

ఇందుకు సంబంధించి ప్రైవేట్  విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంట్, వివరాలతో  స్థానిక జిల్లా కలెక్టర్ కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. ఇందుకు గాను, విద్యాశాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ  విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు ను సీఎం ఆదేశించారు. ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను  మానవీయ దృక్ఫథంతో  ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...