విజయవాడలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీన పడుతుంది. చాలా మంది నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కొంతమంది కీలక నేతలకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాస్త ఎక్కువగా ఫోకస్ చేసి పార్టీలోకి తీసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే సెంటరల్ నియోజకవర్గానికి చెందిన కీలక నేత మీద దృష్టి సారించారని రాజకీయవర్గాలు అంటున్నాయి.
అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి పెట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా విజయవాడ మీద దృష్టి పెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు అయితే పార్టీకి ద్రోహం చేశారో వాళ్లకు సంబంధించి కార్యకర్తలను చంద్రబాబు నాయుడు అడిగే ప్రయత్నం చేస్తున్నట్లు గా ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. వైసిపి ఎమ్మెల్యేలతో విజయవాడలో ఉన్న కొంతమంది కీలక నేతలు మాట్లాడుతూ వారి ఆదేశాలను పాటిస్తున్నారని కొంతమంది చంద్రబాబు నాయుడు వద్దకు సమాచారం పంపించారు.
ఈ నేపథ్యంలో విజయవాడలో విభేదాలను కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అనే భావనలో చంద్రబాబునాయుడు ఉన్నారు. అందుకే త్వరలోనే విజయవాడ నేతలందరితో కూడా ఆయన సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తిరుపతి పార్లమెంటు ఎన్నికయిన తర్వాత చంద్రబాబునాయుడు నిర్ణయాలు తీసుకుని వాటిని ప్రకటించి పార్టీ నేతలకు కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.