కేసీఆర్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. 117 . 35 ఎకరాల అమ్మకానికి గ్రీన్‌ సిగ్నల్‌ !

-

కేసీఆర్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం లో ఉన్నటు వంటి ప్రభుత్వ భూముల అమ్మకానికి మరో సారి చర్యలకు సిద్ధమైంది. ఇందు లో భాగంగానే ఖానా మెట్‌ లో 22. 79 ఎకరాలు, పుప్పాల గూడ లో 94. 56 ఎకరాలు, ఖానా మెట్‌ లో 9 ప్లాట్లు, పుప్పాల గూడ లో 26 ప్లాట్లు అమ్మకానికి పెట్టనుంది తెలంగాణ సర్కార్‌.

cm kcr | సీఎం కేసీఆర్

మొత్తం 117 . 35 ఎకరాల అమ్మకానికి సోమ వారం (ఎల్లుండి ) తెలంగాణ ఐఐసీ నోటీఫికేషన్‌ విడుదల చేయనుంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్‌ 27న ఖానామెట్‌, అదే నెల 29 న పుప్పాల గూడ భూముల ఈ – వేలం నిర్వహించనుంది. తొలి దఫా నిర్వహించిన భూముల అమ్మకం లో ఖానా మెట్‌ లో ఎకరం భూమి రూ. 55 కోట్లు పలికిన సంగతి విధితమే. కాగా.. భూముల అమ్మకం పై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రతి పక్షాల నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version