ఎలక్షన్ టీంని రెడీ చేస్తున్న కేసీఆర్…వాళ్ళు ఫిక్స్ అవుతారా?

-

తెలంగాణలో కేసీఆర్ ఎప్పుడు ఎన్నికలకు వెళ్తారో ఎవరికి క్లారిటీ రావడం లేదు. కానీ ప్రతిపక్షాలు మాత్రం కేసీఆర్ మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఇప్పటికే వారు ఆ దిశగానే పనిచేస్తున్నారు. కానీ టీఆర్ఎస్‌లో మాత్రం ముందస్తు ఎన్నికలు ఉండవని చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్ సైతం ముందస్తుపై ఆలోచన లేదని చెప్పేశారు. కాకపోతే కేసీఆర్‌ని నమ్మడానికి లేదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఆయన ఏ సమయంలో ఏ వ్యూహం వేస్తారో అర్ధం కాదు కాబట్టి…అలెర్ట్‌గా ఉండాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
అయితే ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో క్లారిటీ లేదు గాని, ఎన్నికల బరిలో సత్తా చాటే మంత్రివర్గాన్ని మాత్రం ముందే ఏర్పాటు చేయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గంపై అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి. పైగా పలువురు ఆశావాహులు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం మంత్రివర్గంపై ఇంకా ఏది తేల్చడం లేదు. అలా అని మంత్రివర్గ విస్తరణ లేదని కాదు..త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.
తెలంగాణలో ఇంకా అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు తప్ప మధ్యలో ఎలాంటి ఎన్నికలు లేవు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేపడతారని ప్రచారం జరుగుతుంది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవులు ఆశిస్తున్నారు. ఇప్పటికే మంత్రి పదవి ఆశించే లిస్ట్ పెద్దగా ఉంది.
సీనియర్ నేతలు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వారు పదవులు ఆశిస్తున్నారు. అటు ఇటీవల మరోసారి ఎమ్మెల్సీ అయిన కవితని కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అలాగే దాస్యం వినయ భాస్కర్, గువ్వల బాలరాజు, బాల్క సుమన్, సండ్ర వెంకట వీరయ్య లాంటి వారు పదవి ఆశిస్తున్నారు. మరి వీరిలో కేసీఆర్‌ ఎవరిని మంత్రిగా ఫిక్స్ చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version