సీఎం జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ

-

ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కొత్త జిల్లాలను ఏర్ఫాటు చేయాలన్న ముద్రగడ.. జిల్లాలకు పలువురు ప్రముఖులు పేర్లు పెట్టాలని సూచించారు. అంబేద్కర్, శ్రీక్రిష్ణదేవరాయలు, బాలయోగి సహా మరికొంత మంది పేర్లు పెట్టాలని కోరారు. ఏపీలో 13 జిల్లాలను విభజించి 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు. గోదావరి జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని… కోనసీమకు బాలయోగి పేరు పెట్టాలని సూచించారు.

ప్రస్తుతం ఏపీలో ఉన్న 13 జిల్లాలు త్వరలో 26 జిల్లాలుగా మారబోతున్నాయి. కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేాయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలసిందే. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ప్రతీలోక్ సభ ప్రతిపదికగా ఒక్కోజిల్లా ఏర్పాటు చేయనున్నారు. ఒక్క అరకు లోక్ సభ నియోజకవర్గం విస్తీర్ణంలో పెద్దదిగా ఉండటంతో రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజనుల కోసం రెండు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version