ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించిన విషయం తెలిసిందే. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ పై పలు కీలక విషయాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో చర్చించారు అయితే వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వ్యాక్సిన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఈ సందర్భంగాకరోనా వైరస్ నియంత్రణపై పలు కీలకసూచనలు చేస్తారు. కరోనా వైరస్ పంపిణీపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్… కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన కార్యాచరణను రూపొందించాలి అంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా కరోనా వారియర్స్ కి ఈ వైరస్ వ్యాక్సిన్ ఇస్తామని స్పష్టం చేసిన కేసీఆర్ అంతేకాకుండా తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధులకు కూడా వ్యాక్సిన్ అందిస్తామని చెప్పుకొచ్చారు,