ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా రష్య వ్యాక్సిన్ తెరమీదకి వచ్చింది అనే విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలు రష్యా వ్యాక్సిన్పై అనుమానాలు వ్యక్తం చేశాయి. కాగా రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ 95% ప్రభావవంతంగా ఉన్నట్లు ఆ దేశం పేర్కొంది. ఇటీవలే క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా రెండో మధ్యంతర ఫలితాలకు సంబంధించిన నివేదికను విడుదల చేసిన రష్యా వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తెలిపింది.
కాగా భారత్లో ప్రస్తుతం స్పుత్నిక్ తో కలిసి డాక్టర్ రెడ్డి పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఈ వ్యాక్సిన్ యొక్క ధరను కూడా నిర్ణయించింది సంస్థ. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వ్యాక్సిన్ 10 డాలర్లు గా నిర్ణయించింది. దీని ప్రకారం భారత కరెన్సీలో ఈ వ్యాక్సిన్ యొక్క ధర 750 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే అంతర్జాతీయ ఉత్పత్తిదారులతో ఒప్పందా లు కుదుర్చుకుంటున్నట్లు సదరు సంస్థ వెల్లడించింది. ఏడాదిలో ఒక 500 మిలియన్ల డాలర్లను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పుకొచ్చింది.