కేసీఆర్,ఉద్యోగ సంఘాల భేటీలో వారికి పిలుపు లేదా ?

-

ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం అయ్యారు.. వారి సమస్యల పై చర్చించారు.. అయితే ఈ సమావేశానికి ఆ సంఘాల ను మాత్రం ఆహ్వానించలేదు.. తమను ఎందుకు పిలవలేదని ఆ సంఘాల నేతలు చర్చించుకుంటుంటే … వారి పై సీఎం కోపం తో ఉన్నారనే అందుకే నో ఇన్విటేషన్ అనే ప్రచారం పై ఉద్యోగుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది..

కేసీఆర్ చాలా నెలల తర్వాత ఉద్యోగ సంఘాలతో సమావేశం అయ్యారు… ఉద్యోగుల సమస్యల పై చర్చించారు..రెండు రోజుల క్రితం సీఎం ఉద్యోగుల కు వరాల ప్రకటన తరువాత టీఎన్జీఓ, టిజిఓ నేతలు కలిసి ధన్యవాదాలు తెలిపారు.. ఈ రోజు వారీ తో కలిసి భోజనం చేశారు.. అయితే ఈ సమావేశానికి ఉపాధ్యాయ సంఘాలు హాజరు కాలేదు.. వారికి ఆహ్వానం కూడా లేదు.. గతంలో ఉద్యోగ సంఘాలు సీఎం ని కలిసినప్పుడు కూడా ఉపాధ్యాయ సంఘాలను పిలవలేదు…

ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య గత కొంత కాలంగా పోరు నడుస్తోంది.. సీఎం ఆ సంఘాల పై గుర్రుగా ఉన్నారు… మిగతా ఉద్యోగ సంఘాలతోను ఆ సంఘాల కు పొసగడం లేదు.. వరద సహాయం కి ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగ జాక్ నిర్ణయం తీసుకుంటే ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి.. వాళ్ల జీతంలో ఒక రోజు వేతనాన్ని కట్ కాకుండా చేసుకున్నారు.. గత కొంత కాలంగా పీఆర్సీ ప్రకటించాలని , ప్రమోషన్స్ ఇవ్వాలని బదిలీ లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు.. ప్రభుత్వం కి వ్యతిరేకంగా ఆ సంఘాల నేతలు విమర్శలు చేస్తున్నారు…

ప్రభుత్వం కూడా వారి విషయం లోను ఇలానే వ్యవహరిస్తోంది..మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో వారిని విధులకు దూరంగా ఉంచింది… వారి డిమాండ్స్ ని పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది..
తాజాగా సీఎం ఉద్యోగ సంఘాల తో సమావేశం అవుతున్నారని వార్తలు రావడం తో ఎవరెవరిని ఆహ్వానించారనే దాని పై ఉపాధ్యాయ సంఘాలు ఆరా తీశాయి.. తమకు ఆహ్వానం ఉందా లేదా ఉంటే తమలోని ఏ సంఘాలను పిలిచారు అనే దాని పై ఆ సంఘాల నేతలు వాకబు చేశారు.. చివరికి ఉపాధ్యాయ సంఘాల కు ఆహ్వానం లేదని తేలడంతో ఉసూరు మన్నారు.

తమను ఎందుకు పిలవలేదు..తాము ప్రభుత్వం లో భాగం కాదా అని లోలోన మదన పడుతున్నారు… ఈ విభజించి పాలించడం ఏంటని గొణుక్కుంటున్నారు…తమను ప్రతి సారి అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయితే సీఎంవో నుండి ఏ ఉద్యోగ సంఘానికి అధికారికంగా పిలుపు రాలేదని.. కొన్ని ఉద్యోగ సంఘాలు నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కోసం టైమ్ అడిగితే సీఎం ఇచ్చాడని.. ఈమీటింగ్ అందుకే తప్ప ఉద్యోగా సమస్యలు చర్చించేందుకు కాదు అని కొందరు నేతలు సర్ది చెప్పుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version