కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణాలో వ్యాధి మరింత విస్తరించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు నిత్యావసర సరుకులను అందించాలని, 50 శాతం డిస్కౌంట్ తో అందించే విధంగా కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పౌరసరఫరాల శాఖతో కూడా ఆయన సంప్రదింపులు జరిపారు.
అటు అధికారులు కూడా దీనికి సంబంధించిన సాధ్యా సాద్యాలను పరిశీలించి, కెసిఆర్ కి ఒక నివేదిక ఇవ్వాలని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై ఒక నివేదికను ఇవ్వనున్నారు అధికారులు. ఆ తర్వాత కెసిఆర్ దీనిపై ప్రధాన కార్యదర్శి, ఆర్ధిక, రెవెన్యు, కలెక్టర్లు, పౌరసఫరాల శాఖలతో చర్చలు జరిపి ముందుకి అడుగు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. నిధులు ఎంత కేటాయించాలి అనే దాని మీద ఒక అవగాహనకు వచ్చిన వెంటనే,
సరుకులు ఏమి ఏమి ఇవ్వాలి అనే దాని మీద ఇక జాబితా సిద్దం చేయనున్నారు. పంచదార, పప్పు, ఉళ్లు పాయలు, కోడి గుడ్లు, బియ్యం సహా పలు సరుకులను ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే ఆలు, చేమ దుంప, చిలకడ దుంప కూడా ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.