అప్పుడెప్పుడో.. ఇటలీని పాలించిన నీరో చక్రవర్తి మాదిరిగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నార ని అంటున్నారు సోషల్ మీడియా జనాలు. అదేంటి? అనుకుంటున్నారా..? అప్పట్లో ఇటలీ రాజధాని రోమ్ నగరం తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నారట! అదేవిధంగా ఇప్పుడు టీడీపీ కొంప తగలబడుతుంటే.. చంద్రబాబు కూడా తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని అంటున్నా రు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. అదే సమయంలో టీడీపీలో చంద్రబాబు వైరస్ వ్యాపించి ఆ పార్టీ నేతలను కూడా భయాందోళనలకు గురి చేస్తోందట!
అందుకే వారు పార్టీ నుంచి ఉన్నపళంగా జంప్ చేస్తున్నారని, అయితే, ఈ విషయానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వొద్దని, పార్టీ నుంచి నేతలు పారిపోతున్నారనే విషయాన్ని పెద్దగా ప్రచారం చేయొద్దని చంద్రబాబు తన అనుకూల మీడియాకు సందేశం పంపారట. దీంతో ఎక్కడ ఏం జరిగినా, ఎంత పెద్ద నాయకుడు పార్టీ మారి నా.. కూడా ఈ మీడియా ఉష్ గప్‌చుప్! అనే ఫార్ములాను కొనసాగిస్తోంది. ఒకప్పుడు భారీ ఎత్తున గంటల కొద్దీ సదరు నాయకులతో చిట్ చాట్ చేసిన మీడియా కూడా ఇప్పుడు వారు పార్టీ మారిన విషయాన్ని ఎక్కడా కనీస ప్రస్థావన చేయకపోవడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందని అంటున్నారు.
అయితే, వాస్తవానికి చంద్రబాబు తన కళ్లకు గంతలు కట్టుకుని పార్టీ అంతా బాగుందని ప్రచారం చేసుకున్నా .. జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంది. వెళ్లిపోవాలని భావించిన నాయకులు వెళ్లిపోతూనే ఉన్నారు. కానీ, పార్టీని బాగు చేసుకోవాల్సిన అవసరం, పార్టీ నేతల్లో ధైర్యం నూరిపోసుకోవాల్సిన అవసరం చంద్రబాబుపై ఉంది. పోనీ ఎదురు దాడి చేద్దామని అనుకున్నా.. వైసీపీలోకి వెళ్లిపోతున్న టీడీపీ నాయకులపై ఎలాంటి కేసులు లేనివారు, బాబుకు నమ్మిన బంట్లు ఉండడం గమనార్హం. ఇటీవల పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యేలు ఐజయ్య, యామినీబాల, కేఈ ప్రభాకర్ వంటివారిపై కేసులు లేవు.
కాబట్టి వారిని బలవంతంగా వైసీపీ అధినేత లాగేసుకున్నారని ఆరోపించడానికి. సో.. దీనిని బట్టి పార్టీలో చంద్రబాబు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, ఆయన దానిని వదిలేసి.. పార్టీలో ఏమీ జరగనట్టుగా.. ఎవరూ పార్టీ నుంచి వెళ్లిపోనట్టుగా వ్యవహరించడం వల్ల తనకే నష్టమన్నది సోషల్ మీడియా జనాల అభిప్రాయం. మరి బాబు ఈ అభిప్రాయాలకు కూడా వైసీపీ ముసుగు వేస్తారో.. లేక నిజాలు గ్రహిస్తారో చూడాలి.