తమిళనాడుపై కేసీఆర్ ఎఫెక్ట్.. మామూలుగా లేదుగా..?

-

తమిళనాడుపై కేసీఆర్ ఎఫెక్ట్ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా.. అవును.. ఎందుకంటే సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులపై కేసీఆర్ తీసుకుంటున్న వైఖరి అక్కడి ప్రభుత్వానికి మార్గదర్శకంగా మారింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె దాదాపు నెలరోజులకు చేరువవుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

అంతే కాదు.. ఇక మీరు ఉద్యోగులే కాదు పొమ్మని సాక్షాత్తూ సీఎం కేసీఆరే చెబుతున్నారు. సమ్మె ప్రారంభిచిన మొదటి రోజే కేసీఆర్ ఈ విషయం తేల్చి చెప్పేశారు. అప్పటి నుంచి ఆయన ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే స్టాండ్ తీసుకుంటోంది.

గతవారం రోజులుగా తమిళనాడులో వైద్యులు నిరవధిక సమ్మె చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ వైద్యులతో సరిసమానంగా జీతాలు చెల్లించాలన్నది తమిళనాడు వైద్యుల సంఘం డిమాండ్. మొత్తం 17 వేల మంది వైద్యులు గతవారం సమ్మెకు దిగారు. వైద్యుల సమ్మె అంటే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

ఆర్టీసీ సమ్మె అంటే ఏదో ఒక వాహనం పట్టుకుని కాస్త ఇబ్బంది పడతారు.. కానీ వైద్యుల సమ్మె అంటే ప్రజల ప్రాణాలే ప్రమాదంలో పడతాయి. అయితే ఈ విషయంలో తమిళనాడు సీఎం కేసీఆర్ ను ఫాలో అయ్యారు. సమ్మె విరమించకపోతే ఉద్యోగాల్లోంచి తొలగించి.. కొత్తవారిని నియమించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

దాదాపు పదిరోజులపాటు సమ్మె సాగినా సర్కారు దిగిరాకపోగా.. ఉన్న ఉద్యోగాలకే ఎసరు వచ్చే పరిస్థితిరావడంతో వైద్యులు ఆలోచనలో పడ్డారు. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ వార్నింగ్ నేపథ్యంలో దిగివచ్చారు. సమ్మెను నిలిపివేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version