గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన పీవీ సింధు.. మ‌రో ముగ్గురికి స‌వాల్‌..

-

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కు విస్తృత ప్రజాదరణ లభిస్తోంది. ప్రముఖులు ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొంటున్నారు. ఇక తాజాగా ఎంపీ జోగినపల్లి సంతోష్ విసిరినా గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు స్వీకరించారు. గోపీచంద్ బ్యాట్మింటన్ అకాడమీలో మొక్కలు నాటారు.

అయితే తాను మొక్కలు నాటడమే కాదు మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. విరాట్ కోహ్లీ, అక్షయ కుమార్, సానియా మీర్జాలకు మొక్కలు నాటాల్సిందిగా ట్విట్టర్ వేదికగా ఛాలెంజ్ విసిరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు సింధు అభినందనలు తెలిపారు. ఈ మంచి పనిలో తాను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version