కేసీఆర్ స‌ర్కార్ కీలక నిర్ణ‌యం.. ఇంగ్లీష్ మీడియంలో ఇంట‌ర్ విద్య!

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీల‌లో ఇంగ్లీష్ మీడియం ప్ర‌వేశ పెట్టాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇప్పటి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రంలో జూనియ‌ర్ కాలేజీల‌లో ఇంగ్లీష్ మీడియం కేవ‌లం 5 కాలేజీల‌లోనే అందు బాటులో ఉంది. తెలుగు మీడియంలో బోధ‌న‌లు సాగు ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీలు 334 ఉన్నాయి.

త్వ‌ర‌లోనే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం ప్ర‌వేశ పెట్టాల‌ని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాని కోసం ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు కూడా ప్రారంభించిన‌ట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో జిల్లాల వారిగా స‌మాచారాన్ని కూడా ప్ర‌భుత్వం సేక‌రిస్తోంది. కాగ ఇంగ్లీష్ మీడియం పాలిసీ తో పాటు ఫీజు నియంత్ర‌ణ చ‌ట్టం రూప క‌ల్ప‌న పై చ‌ర్చించ‌డానికి రాష్ట్ర మంత్రి వ‌ర్గ ఉప సంఘం ఈ నెల 21 న స‌మావేశం కానుంది. ఈ సమావేశం త‌ర్వాత ప్ర‌భుత్వం ఇంగ్లీష్ మీడియం పై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news