సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం అయిన సాగతి తెలిసిందే. అయితే ఈ కేబినెట్ సమావేశం సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అనాధలు, అనాధ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్ర కరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కెటిఆర్ ఉండనున్నట్లు ప్రకటించారు సిఎం కెసిఆర్. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలైన పిల్లల పూర్తి వివరాలు తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని ఈ మేరకు ఆదేశించింది తెలంగాణ కేబినెట్. ఈ విషయంపై అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక అటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితి పై చర్చిస్తున్న కేబినెట్… దేశంలో పలు రాష్ట్రాల పరిస్థితి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితి, వాక్సినేషన్, దవాఖానాల్లో ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతుల పై చర్చిస్తున్నది.