రైతుల కోసం స్వయంగా రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్..!

-

రైతుల భూసమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల్లో దశాబ్దాల నుంచి భూ సమస్యలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సీఎం ఆ గ్రామాల సర్పంచులతో ఇవాళ ఫోన్లో మాట్లాడారు. మూడు రోజుల్లో రైతులకు రైతు బంధు చెక్కులు అందజేస్తామని హామీ ఇచ్చారు. 10 రోజుల్లోగా తానే స్వయంగా వచ్చి పట్టాదారు పాసు బుక్‌లను అందజేస్తానని వెల్లడించారు.

 

రైతుబంధు, రైతుబీమా పథకాలు కూడా అందడం లేదని సర్పంచ్‌లు పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించారు. పలువురు నాయకుల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) శ్రావణ్‌కుమార్‌ శుక్రవారం మధ్యాహ్నం కొత్తపేటకు చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version