RTC ని అమ్మేస్తే..రూ.1000 కోట్ల నజరానా ఇస్తారట – సీఎం కేసీఆర్‌

-

RTC ని అమ్మేస్తే..రూ.1000 కోట్ల నజరానా ఇస్తారట అంటూ కేంద్ర ప్రభుత్వంపై అసెంబ్లీలో విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్‌. సంస్కరణలు అనే అందమైన ముసుగు తొడిగి కేంద్రం దోచుకుంటుంది.. అమ్మేసుడే పనిగా పెట్టుకుంది.. ఆర్టీసీని అమ్మేయండి అన్నది.. ఎవరు ముందు అమ్మితే వాళ్లకు వెయ్యి కోట్ల నజరానా ఇస్తారట అంటూ మండిపడ్డారు సీఎం కేసీఆర్‌. పవర్..ఉమ్మడి జాబితా లోనిదని.. రాష్ట్రాలను అడగకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారన్నారు.


ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా చేస్తుంది కేంద్రమని.. అధికార పార్టీ సభ్యులు ఎక్కువ ఉండి ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా చేసింది బీజేపీ అని ఆగ్రహించారు. గెజిట్ లో.. లేదు అని రఘునందన్ రావు అబద్దం చెప్తున్నారు…. ఏపీలో మీటర్లు పెడితే కాలపెట్టారని గుర్తు చేశారు. బీజేపీ చెప్పే దానికి కేంద్రం చేసే దానికి తేడా ఉందన్నారు. తెలివితక్కువ కేంద్ర ప్రభుత్వమని… రైతుల నోట్లో కేంద్రం మట్టికొడుతుందని ఆగ్రహించారు. ఎక్కడ అయిన మేము చర్చకు రెడీ అని.. దేశంలో ప్రజాస్వామ్యము ఉండవద్దట …కొందరు బిజెపి నేతలు మాట్లాడతారని విమర్శలు చేశారు. దేశంలో ఏక పార్టీ ఉంటది అంటారని.. అన్ని పార్టీలను బ్యాన్ చేయండి…ఎవరో ఉండేదో తేలుతుందని సవాల్‌ చేశారు కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version