బ్రేకింగ్ : మోడీ మీద యుద్ధం ప్రకటించిన కేసీఆర్.. రెండో వారంలో కాంక్లేవ్

-

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ కీలక నేతలతో అధ్యక్ష్యులు సమావేశం అయిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో డిసెంబర్ రెండో వారంలో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. మోదీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వచ్చే నెల ఒక కాంక్లేవ్ నిర్వహించనున్నట్లు సమాచారం.

ఈ విషయమై ఇప్పటికే పది మంది పార్టీ అధ్యక్షులు అలాగే కొద్ది మంది ముఖ్యమంత్రులుతో కూడా కేసీఆర్ చర్చించినట్లు సమాచారం అందుతోంది. కేంద్రంలో బీజేపీ కొత్త ఒక్క సంక్షేమ పథకం కూడా తీసుకు లేదని ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు కూడా ఉపసంహరిస్తోదని కేసీఆర్ విమర్శించి నట్లు సమాచారం… ఇంకా మరి కాసేపట్లో గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు 105 మంది తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version